10-05-2025 12:42:23 AM
నారాయణఖేడ్, మే 9: నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని జూకల్ శివారులో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి శుక్రవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో అసంపూర్తి పనులను త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన కాంట్రాక్టర్లకు రావలసిన బకాయిలను త్వరలోనే విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అసంపూర్తి పనులైన శానిటరీ, నీటి వసతి పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలం లేని వారికి డబల్ బెడ్ రూమ్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఆయన డబుల్ బెడ్ రూమ్ లను తిరుగుతూ పనులను పరిశీలించారు.
ఎమ్మెల్యే వెంట స్థానిక మున్సిపల్ కమిషనర్, నాయకులు తాహేర్, దారం శంకర్ సెట్, న్యాయవాది సంఘటన, పండరి రెడ్డి, నారాయణ జాదవ్, తదితరులు ఉన్నారు. కాగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక అంగన్వాడి టీచర్లు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు, మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ అంగన్వాడి టీచర్లుగా మార్చడంతో పాటు వారి వేతనం రూ .7800 నుండి రూ.13,600 కు తెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.