calender_icon.png 25 September, 2025 | 4:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదనపు ఖర్చులు చేయకండి

25-09-2025 12:46:18 AM

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలించిన కలెక్టర్ 

జడ్చర్ల, సెప్టెంబర్ 24: అదనపు ఖర్చులు తగ్గించుకొని ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించి ఇందిరమ్మ ఇండ్లను నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జడ్చర్ల మండలం మల్లెబోయిన పల్లి, మాచారం గ్రామంలలో గల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడారు.

ప్రభుత్వము పూర్తిస్థాయిలో నివేదికలను పరిశీలించిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని ప్రభుత్వాన్ని ఇబ్బందుల ప్రకారం నిర్మాణం చేపడితే తక్కువ ఖర్చు అవుతుందని తెలిపారు. ఇండ్లు మంజూరై ఇప్పటికీ ప్రారంభించిన వారు వెంటనే ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.