25-09-2025 12:45:32 AM
ఆళ్ళపల్లి, సెప్టెంబర్ 24, (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం పరిధిలోని ఆళ్లపల్లి మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మొక్కజొన్న పంట పూర్తిగా ధ్వంసమైంది. వివరాల్లోకి వెళితే మైలారం గ్రామానికి చెందిన జోగా నాగేశ్వరరావు అనే రైతు సుమారు 6 ఎకరాల కోత దశకు వచ్చిన మొక్కజొన్న పంట అధిక వర్షాలకు పూర్తిగా నేలకొరిగింది.
పంట సాగుకు అప్పో సపోజ్ చేసి ఆరుగాలం కష్టపడి సాగు చేస్తే అధిక వర్షాలు తీరని నష్టాన్ని కలిగించిందని వాపోతున్నాడు.రైతు ఈ మొక్కజొన్న సాగు కోసం సుమారు రూ 1.50లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేయగా, ఉన్న ఆరెకరాలు పూర్తిగా దెబ్బ తినడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. ప్రభుత్వ అధికారులు దెబ్బతిన్న మొక్కజొన్న చేనుకు నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.