14-10-2025 12:00:00 AM
రైతులకు ఎస్పీ రాజేష్ చంద్ర సూచన
కామారెడ్డి, అక్టోబర్ 13 (విజయక్రాంతి): రోడ్డు భద్రత మన అంధరి భాద్యత అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రతే ముందురోడ్లపై పంటలు ఆరబెట్ట వద్దని ప్రయాణికుల ప్రాణాలు రక్షించ వలసిన బాధ్యత ఉందని చిన్న నిర్లక్ష్యంపెద్ద విషాదం కాకూడదని అన్నారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం రోడ్లపై మక్కలు, వడ్లు, ఆరబెట్టడం వల్ల జరిగినవని గుర్తించబడిందన్నారు. రోడ్లపై పంటలు ఆరబెట్టడం వల్ల వాహనాలు జారి అదుపు తప్పడం, రోడ్డు మీద కూర్చున్న రైతులు లేదా పాదచారులు ఢీకొనడం వంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి అని తెలిపారు.
ఈ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాలు తమ కుటుంభ పెద్దలను, సభ్యులను కోల్పోయి తేరుకోలేని స్తితిలోకి వెళ్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ వడ్లు, మక్కలు, జొన్నలు వివిధ రకాల ధాన్యాలు రోడ్లపై ఆరబెట్టకండని తెలిపారు.