calender_icon.png 14 May, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దు

14-05-2025 12:07:00 AM

ఎస్సై ప్రవీణ్ కుమార్

మునగాల మే 13: సూర్యాపేట జిల్లా మునగాల మండల రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టవద్దని ఎస్ ఐ   ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ నిప్పు పెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. .రైతులు మేతకు పశువులను వదిలిపెట్టడం వల్ల అవి దొంగలించబడే అవకాశం ఉందని, రైతులు పశువులను మేతకు వదల వద్దని రైతులకు సూచించారు. మీ వ్యవసాయ పొలాల దగ్గర ఉన్న మీ వ్యవసాయ మోటా ర్లను ఇతర పరికరాలను తీసుకుని ఇంటిలో భద్రపరుచుకోవాలని సూచించారు.