14-05-2025 12:07:44 AM
గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం
హైదరాబాద్, మే 13 (విజయక్రాంతి): మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగరాల గ్రామంలోని పెద్దగుట్ట మీద 16034’51 ఉత్తర అక్షాంశాలు, 77052’31 తూర్పు రేఖాంశాలపై కొత్త రాతిచిత్రాల తావును కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కావలి చంద్రకాంత్ గుర్తించారు. ఈ రాతిచిత్రాలు ఎరుపురంగులో వేసినవి. కింది నుంచి పైకి ఒక రథంలా కనిపిస్తున్న ఈ ఎరుపురంగు గీతలలో కిందివైపు ఒక మ నిషి, అతనిపైన చతురస్రాకారంలో కనిపిస్తు న్న తాబేలు, పక్కన నిచ్చెనవంటి నిలువుగీతలు ఉన్నాయి.
ఇవి చారిత్రక కాలానికి, మ ధ్యయుగాలకు చెందిన రాతిచిత్రాలని చరిత్రబృందం రాతిచిత్రాల నిపుణులు బండి మురళీధర్‌రెడ్డి, శ్రీరామోజు హరగోపాల్ అభిప్రాయపడ్డారు. బొమ్మలోపల బొమ్మలవలె ఒక మనిషి నిలువుబొమ్మలో గీసారా అన్నట్టు వుంది. ఇది స్థానిక ప్రజల్లో ఒక వ ర్గం వారి పూజాస్థానం అని అనిపిస్తున్నట్టు తెలిపారు.
ఈ రాతిచిత్రాల తావు పరిసరాల్లో పురామానవుల సమాధులు, ఆవాసాల జాడలున్నాయి. పూర్తిస్థాయిలో అన్వేషిస్తే మరిన్ని చరిత్రపూర్వయుగ సంస్కృతులు తెలిసే అవకాశముందని చంద్రకాంత్ భావిస్తున్నారు.