calender_icon.png 8 November, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ప్రైవేటు’కు నియమాలు పట్టవా?

08-11-2025 12:52:07 AM

- భద్రత, ఫైర్ సేఫ్టీ పై నిర్లక్ష్యం

- కానరాని పరిశుభ్రత 

- అన్నీ హాస్పిటల్ల వద్ద పార్కింగ్ గోస

- ఉల్లంఘనులపై చర్యలు తప్పవు:డీఎంహెచ్‌ఓ

సిద్దిపేట కలెక్టరేట్, నవంబర్ 7: జిల్లా పరిధిలో ప్రైవేట్ ఆసుపత్రులు స్థాపించాలనుకునేవారు, ప్రభుత్వం నిర్దేశించిన నిబంద నలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి సిహెచ్.ధనరాజ్ తెలిపారు. ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా జిల్లా డీయం అండ్ ఎచ్‌ఓ అనుమతులు తీ సుకోవాలన్నారు. భవనం, భద్రత, ఫైర్ సేఫ్టీ, పరిశుభ్రత, (బయో మెడికల్) వ్యర్థ నిర్వహణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి వంటి అంశాలను పరిశీలించిన తర్వాతనే అనుమతులు జారీ చేస్తామని వివరించారు.

అర్హత కలిగిన ఎంబిబియస్ వైద్యులు, నర్సు లు, ల్యాబ్ టెక్నీషియన్లతో మాత్రమే ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని తె లిపారు. అర్హత లేని నకిలీ డాక్టర్లు స్థాయికి మించి వైద్యం చేస్తే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఉండే స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేయరాదని తెలిపారు. రోగులకు వసూలు చేసే చార్జీల వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలని సూచించా రు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణలో నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి కఠిన చర్య లు తీసుకుంటామని సూచించారు. 

పార్కింగ్ తప్పనిసరి...

ప్రతి ఆస్పత్రికి తప్పనిసరిగా పార్కింగ్ స్థలం ఉండాలి. గతంలో ఏర్పాటు చేసిన ఆ స్పత్రుల నిర్వాహకులు కూడా పార్కింగ్ స్థ లం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసే ఆస్పత్రుల నిర్వాహకులు తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని చూపించాలని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రు ల వద్ద ఉన్న పార్కింగ్ సమస్యలపై మున్సిపల్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసు కుంటామని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి సిహె చ్.ధనరాజ్ తెలిపారు.

అంబులెన్సులు వెళ్లలేని స్థితిలో సిద్దిపేట ప్రైవేట్ ఆసుపత్రిలో జోరు ఏర్పడిందని ఇప్పటికే పార్కింగ్ స్థలా లు లేని ఆసుపత్రుల సమాచారం సేకరించినట్లు చెప్పారు. త్వరలోనే నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆస్పత్రి చుట్టూ ఫైర్ ఇంజన్ తిరిగే విధంగా స్థలం ఉండాల్సిన నిబంధన ఉంద ని, నిబంధనలకు అనుగుణంగానే భవనాలు నిర్మించుకోవాలని చెప్పారు.