08-11-2025 12:50:41 AM
* మున్సిపల్ అధికారుల పనితీరుకు నిదర్శనం
* కార్యాలయానికి పరిమితమైన కమిషనర్
జహీరాబాద్, నవంబరు 7 :జహీరాబాద్ మున్సిపల్ అధికారుల పనితీరుకు హౌసింగ్ బోర్డులోని పార్కు నిదర్శనంగా నిలుస్తోంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రజలు తమ ఆరో గ్యా న్ని కాపాడుకునేందుకు పార్కులో నడుస్తూ, వ్యాయామం చేస్తూ తిరుగుతూ ఉంటారు. జహీరాబాద్ హౌసింగ్ బోర్డులోని పార్కు మాత్రం ఇందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. పార్కు చుట్టూ ఇండ్లు ఉన్నప్పటికీ పార్కు మాత్రం చిట్టడవిని తలపిస్తుంది.
ఈ పార్కులో ఏపుగా పెరిగిన గడ్డి అందులో సంచరిస్తున్న పందులు, కుక్కలు విహరిస్తున్నా మున్సిపల్ అధికారులు మాత్రం ని మ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పార్కులో ఉన్న చెట్లకు, పచ్చని గడ్డికి నీరు పోయకపోవడంతో చెట్లు ఎండిపోయి అడవిలా కనిపిస్తుంది. దీంతో వాకింగ్ చేయాల్సి వస్తే ఇతర ప్రాం తాలకు, రోడ్లపై వెళ్లి వస్తుంటారు. హౌసింగ్ బోర్డ్ నిర్మాణం అయ్యే సమయంలో ప్రజల సౌకర్యార్థం కోసం కొంత స్థలాన్ని పార్కుకు వదిలి చుట్టూ కంచె వేసినప్పటికీ ఈ పార్కుకు గేటు లేక పోవడంతో అందులోకి మూగ జీవాలు చేరి నివాసముంటున్నాయి.
మున్సిపల్ అధికారులు మాత్రం పార్కులోని గడ్డిని తొలగించడం లేదు. దానికి గేటును కూడా ఏర్పాటు చేయలేకపోతున్నారు. లోపటికి వెళ్లాలంటే గేటు ముందు చెత్త చెదారం వేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం తొలగించడం లేదు. ఈ పార్కు ముందు నుండి వెళ్లే మురుగు కాలువ చెత్తాచెదారం నిండిపోయి దుర్గంధంతో పాటు ఈగలు, దోమలు వ్యాప్తి చెందుతున్నాయి.
మున్సిపల్ కమిషనర్ మాత్రం కార్యాలయానికే పరిమితం కావడం వల్ల పని చేసేవారు మాత్రం పట్టించుకోవడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో జహీరాబాద్ పట్టణంలో ఎక్కడ చూసినా మురికి కాలువలు నిండుకొని చెత్తాచెదారం కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పార్కును వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.