22-07-2025 12:00:00 AM
వనపర్తి, జూలై 21 ( విజయక్రాంతి ) : వనపర్తి పట్టణంలో నెలకొన్న పెండింగ్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి...త్వరితగతిన పూ ర్తి చేయాలని బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సోమవారం వనపర్తి పట్ట ణంలో భారీగా తరలివచ్చిన స్థానిక ప్రజలతో కలిసి చింతల ఆంజనేయ స్వామి ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాతబజార్ లోని కాళీకాంబ ఆలయాన్ని దర్శించుకుని జమ్మిచెట్టు నుంచి గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్, వి వేకానంద చౌరస్తా మీదుగా హాకీ అకాడమీ వరకు సమస్యలు తెలుసుకుంటూ మార్నింగ్ వాకింగ్ చేశారు.
ఈ సందర్భంగా రాచాల మీడియాతో మాట్లాడుతూ ఏళ్లుగా అసంపూర్తిగానే రోడ్ల విస్తరణ ప్రక్రియ సాగడం సిగ్గుచేటని, రోడ్ల విస్తరణ పనులు వెంటనే పూర్తి చేసి బాధితులను ఆదుకోవాలన్నారు. కోట్లాది రూపాయల ప్రజా ధనంతో నిర్మించిన టౌన్ హాల్, కందకం యందు నిర్మించి న కూరగాయల మార్కెట్ సముదాయాన్ని మరియు ఇండోర్ స్టేడియాన్ని వెంటనే అం దుబాటులోకి తేవాలన్నారు.
గాంధీ చౌకులో ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ మరి యు మరుగుదొడ్లు నిర్మించాలన్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ ముందు తవ్విన రోడ్డును వెం టనే పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుం డా చూడాలన్నారు. పాత బస్టాండును త్వరితగతిన నిర్మించి ప్రయాణికులకు అందుబా టులోకి తేవాలని ఆర్టీసీ అధికారులను కోరా రు.
హాకీ అకాడమీలో క్రీడాకారులకు సరైన వసతులు లేవని, గత ఐదేళ్లుగా ఒక్క హాకీ స్టిక్ కూడా ఇవ్వలేదని క్రీడాకారులు రాచాల దృష్టికి తీసుకురాగా...స్పోరట్స్ అథారిటీ చైర్మెన్ ఇదే జిల్లాకు చెందిన నాయకుడని, తన స్వంత నియోజకవర్గంలో క్రీడాకారులు ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమని, క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నా రు. ప్రతీ కాలనీకి సీసీ రోడ్లు, శివారు కాలనీల వరకు నల్లా కనెక్షన్లు ఇవ్వాలన్నారు.
గత ప్రభుత్వంలో బీసీ బాలుర కళాశాల వసతి గృహం మంజూరు చేసి రూ.1.5 కోట్లు నిధు లు కేటాయించారు కానీ స్థలం కేటాయించలేదని వెంటనే స్థలం కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ గారు పట్టణ అభివృద్ధిపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షా సమావేశా లు నిర్వహించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆయ న కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి పట్టణ అధ్యక్షుడు దేవర శివ, రా ష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు గూడుషా, శ్రీరంగాపూర్ మండల అద్యక్షుడు ధర్మేంద్ర సాగర్, ప్రధాన కార్యదర్శి అస్కని రమేష్, మదనాపూర్ మండల కన్వీనర్ నరసింహ యాదవ్, ప్రసాద్ గౌడ్, నాగరాజు, నరేందర్ సాగర్ యశ్వంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.