calender_icon.png 25 July, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి

22-07-2025 12:00:00 AM

యాదాద్రి భువనగిరి జులై 21 (విజయ క్రాంతి): పభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న  అన్ని సదుపాయాలను విద్యార్థినిలు ఉపయోగించుకుంటూ మంచిగా చదువుకోవాలని స్థానిక సంస్థల అదనప కలెక్టర్ భాస్కరరావు అన్నారు. సోమవారం భువనగిరి పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ( కేజీబీవీ) స్కూల్ ను  అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ విద్యార్థినీనులతో మాట్లాడుతూ...  మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకు న్నారు.

పాఠశాలలో ఏఎన్‌ఎం రావడం లేదని తెలుసుకొని వెంటనే డీఈఓ తో ఫోన్లో మాట్లాడి కొత్తవారిని తీసుకోవాలని డి.ఈ. ఓ కి చెప్పడం జరిగింది.పాఠశాలలో విద్యార్థినిలు ఇబ్బంది లేకుండా ప్రతిరోజు స్కూల్ కి  ఒక వాటర్ ట్యాంక్ పంపించవలసిందిగా సంబంధిత అధికారులకు తెలిపారు పాఠశాల ఆవరణలో  పిచ్చి మొక్కలు తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాల న్నారు.

పాఠశాల యూనిఫారమ్స్  అందరికీ వచ్చాయా లేదా అని అడిగి  తెలుసుకున్నారు. పాఠశాలలో సరిపోను  టీచర్స్ ఉన్నారా లేరా అని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిలు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను ఉపయోగించుకుంటూ స్నేహ పూర్వకంగా అందరూ కలసి ఉంది మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలన్నారు