calender_icon.png 25 September, 2025 | 1:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను ఇబ్బందులు పెట్టొద్దు

25-09-2025 12:39:17 AM

జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్

మిడ్జిల్, సెప్టెంబర్ 24 : రైతులను ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు గురి చేయకూడదని వాస్తవ పరిస్థితులను వారి ముందు ఉంచాలని జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ అన్నారు. బుధవారం మండలంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేసి ఎరువుల స్టాక్ రిజిస్టర్ ఫార్మర్ సెల్ రిజిస్టర్ బిల్ బుక్ లను పరిశీలించారు. స్టార్ట్ బోర్డు తప్పనిసరిగా ప్రతిరోజు అప్లైట్ చేయాలని రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని దుకాణదారులకు సూచించారు.

మండలానికి 90.45 టన్నుల యూరియా వచ్చిందన్నారు. రైతులు ఎవరు అధైర్య పడద్దని అందరికీ యూరియా దొరుకుతుందన్నారు. అలాగే రైతులు అధిక మోతాదులో యూరియా వాడకాని తగ్గించాలని తెలిపారు. ప్రవేట్ ఎరువుల డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించవద్దని అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎరువులను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మాలని అధిక ధరలకు అమ్మితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సిద్ధార్థ, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయికృష్ణ, భగత్, తదితరులు ఉన్నారు.