calender_icon.png 7 September, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అధ్వానంగా ఉన్న రేకుర్తి చౌరస్తా రోడ్డును పట్టించుకోరా..?

04-09-2025 12:00:00 AM

కొత్తపల్లి, సెప్టెంబరు 3 (విజయ క్రాంతి): నగరంలోని రేకుర్తి చౌరస్తాలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అద్వానంగా ఉందని, కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయిన ప్పటికీ అధికారులు, రాజకీయ నాయకులు ఎవరూ పట్టించుకోవడం లేదని ధర్మానికి చెందిన కోట శ్యామ్ కుమార్ బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు.

రోడ్డు బాగా లేక ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. రోడ్డు పైన నేను ఏది ధరించక పో యినా& అన్నింటికీ ఫైన్ కడుతున్నాను.. జీఎస్టీ, రోడ్డు టాక్స్ కడుతున్నాను.. కానీ అసలు రోడ్లే సరిగా లేవు& మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని కరీంనగర్ కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను ప్రశ్నిస్తూ ఫ్లకార్డు ప్రదర్శించి వినూత్ననిరసనతెలిపారు.