calender_icon.png 5 September, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్టు

04-09-2025 12:00:00 AM

జహీరాబాద్, సెప్టెంబరు 3 : జహీరాబా ద్ సమీపంలోని అల్లానా కర్మాగారం వద్ద గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ప ట్టుకున్నట్లు ఎస్త్స్రలు హనుమంతు, అనుదీప్ లు తెలిపారు. జిల్లా ఎక్సైజ్ అధికారి ఆదేశాల మేరకు అల్లాన కంపెనీ వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని స్కూటీ పై తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులు సత్వార్ గ్రామానికి చెందిన మొహమ్మద్ ఖయ్యూం, ఫకీర్ అయూబ్లను పట్టుకున్నట్లు వారు తెలిపారు.

వారి వద్ద నుండి 140 గ్రాముల ఎండు గంజాయిని, డియో స్కూటీ, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపర్చుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితులను జహీరాబాద్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించామన్నారు. దాడిలో కానిస్టేబుల్ అరుణ జ్యోతి, అంజిరెడ్డి, రాజేష్ పాల్గొన్నారు.