04-09-2025 12:00:00 AM
దీపక్ జాన్
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 03(విజయక్రాంతి): క్రైస్తవ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ తెలిపారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝతో కలిసి పాస్టర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. బరియల్ గ్రౌండ్స్, చర్చిల నిర్మాణ అనుమతులు, భూ కేటాయింపులు, కుల ధ్రువీకరణ పత్రాల జారీ వంటి అంశాలపై చర్చించారు.
క లెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు 15 రోజుల్లో అనుమతు లు జారీ చేస్తామని, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే భూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.పాస్టర్లు, మైనారిటీ అధికారులతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో పలుసూచనలుచేశారు.