05-10-2025 06:02:00 PM
మరిపెడ (విజయక్రాంతి): నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి దొంతి కాంతమ్మ శనివారం అనారోగ్యంతో మరణించారు. హనుమకొండలోని ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ఇంటికి చేరుకొని కాంతమ్మ భౌతికాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అతను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి మాతృ వియోగం బాధాకరమన్నారు.