calender_icon.png 5 October, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారంపల్లి గౌడ సంఘం నూతన పాలకవర్గం నియామకం

05-10-2025 05:57:43 PM

తంగళ్ళపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామ గీత కార్మికుల సంక్షేమ సంఘం(గౌడ సంఘం) ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ నియామక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షుడిగా గుగ్గిళ్ల అంజనేయులు గౌడ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. ఉపాధ్యక్షులుగా కోలా నాగరాజు, బాలుసాని దేవరాజులను ఎంపిక చేయగా, డైరెక్టర్లుగా గుగ్గిళ్ల భూమయ్య, పాలకుర్తి రాములు, కోలా చిన్న ఎల్లయ్య, గుగ్గిళ్ల శ్రీనివాస్, గుగ్గిళ్ల శేఖర్, కోలా భాస్కర్, గడ్డమీది చంద్రయ్యను ఎన్నుకున్నారు.

నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు గౌడ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, పలువురు గ్రామస్తులు అభినందనలు తెలియజేశారు. కొత్త నాయకత్వం గ్రామ గౌడ సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోలా గంగారాం, కోలా నాగరాజు, గుగ్గిళ్ల రాములు, గుగ్గిళ్ల శ్రీనివాస్, కోలా రాజయ్య, బుర్ర శ్రీనివాస్, గుగ్గిళ్ల సాయిరాం, గుగ్గిళ్ల భరత్, అభిషేక్, రోహిత్ గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.