23-01-2026 12:43:19 AM
కూకట్‌పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్ బండి రమేష్
సికింద్రాబాద్ జనవరి 22 (విజయక్రాంతి) : ఫతేనగర్ డివిజన్ అమృత్ నగర్ తండావాసుల 40 ఏళ్ల స్వప్నం సాకారం కాబోతుంది. ఇక్కడ నివసిస్తున్న ఎస్ సి,ఎస్ టీ నివాసితులకు పట్టాలు మంజూరు చేసి కైతలాపూర్ దగ్గర్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వ నుంచి బుధవారం శుభవార్త అందజేశారు. దీంతో ఈ తండావాసుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది ప్రజాసమస్యల పరిష్కారంలో భాగం గా గత నవంబర్‌లో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ టిపిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ ఈ తండాను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయనకు తండావాసులు తాము ఇక్కడ 40 ఏళ్లుగా ఉంటున్నామని, ఎలాంటి సౌకర్యాలు లేవని, రోడ్లు తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేక ఇబ్బం దులు పడుతున్నామని రమేష్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన ఆయన ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత సలహాదారుడు వేంనరేంద్ర రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై వారు ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, బీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ఫతేనగర్ డివిజన్ ప్రెసిడెంట్ కుక్కల రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హమీద్, శివ చౌదరి, అయాజ్ తదితరులు పాల్గొన్నారు.