23-01-2026 12:44:21 AM
ఆమనగల్లు, జనవరి 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అందుతున్న ‘ఆరు గ్యారంటీల’ పథకాలే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్ష అని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. గురువారం అచ్చంపేట నియోజకవర్గానికి వెళ్తున్న క్రమంలో ఆమనగల్లులో ఆగిన ఆయనకు బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ అనిల్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో యువతకు సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.
‘రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకు పెద్దపీట వేస్తున్నాం అని.... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అర్హులైన యూత్ కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పోటీ చేయాలి‘ అని ఆయన ఆకాంక్షించారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోనున్నాయన్నారు. భక్తుల ఇలవేల్పు మైసగండి అమ్మవారి క్షేత్రాన్ని గొప్ప పర్యాటక కేంద్రంగా మారు తుందాన్నరు.అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తేనే పట్టణాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయని ఆయన పునరుద్ఘాటించారు. అనంతరం ఇటీవల సర్పంచులుగా గెలుపొందిన రాములు పాలకూర కర్ణాకర్ గౌడ్ లను ఆయన సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కేశవులు, చెన్నారెడ్డి, మనయ్య, కాలే మల్లయ్య, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణ నాయక్,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.