calender_icon.png 23 January, 2026 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లో చోరీ

23-01-2026 12:42:57 AM

బంగారు, వెండి ఆభరణాలు, యూఎస్ డాలర్లు, కొంత నగదు చోరీ 

4 ప్లాట్లలో చోరీకి దొంగల ప్రయత్నం విఫలం 

తాళం వేసి ఉన్న ప్లాట్లు టార్గెట్

ఘట్ కేసర్, జనవరి 22 (విజయక్రాంతి) : పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి సంస్కృతి టౌన్ షిప్ లో బుధవారం అర్ధరాత్రి దొంగలు తాళం వేసి ఉన్న ఫ్లాట్లను టార్గెట్ చేశారు. ఏ బ్లాక్ లోని ఏ24/203, ఏ34/206 ఫ్లాట్ల తలుపు తాళాలను తీసే ప్రయత్నంలో విఫలం అయ్యారు. కాగా ఏ33/106 ఫ్లాట్ యజమాని పవన్ కుమార్ సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్ళాడు. ఆ ఫ్లాట్ లో చొరబడి అల్మారా లో వస్తువులను చెల్లాచెదురుగా పారేశారు. దొంగతనం జరిగిన సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. ఐదు ఫ్లాట్లలో దుండగులు దొంగతనానికి యత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

తన ప్లాట్ లో దొంగతనం జరిగినట్లు తెలుసుకున్న పవన్ కుమార్ గురువారం ప్లాట్ వద్దకు చేరుకుని పరిశీలించగా అలమారా లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండి అందులో భద్రపరిచిన 20 గ్రాముల బంగారు కాయిన్స్, 10 గ్రాముల బంగారు రింగ్, 50 గ్రాముల సిల్వర్ వెండి లాకెట్, ఐదు గ్రాముల వెండి ఉంగరాలు, కొన్ని యూఎస్ డాలర్లు, రూ. 30 వేల నగదు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు అందజేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుతున్నట్లు పోలీసులు తెలిపారు.