calender_icon.png 7 September, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండింతల మద్దతు సంతోషం

05-09-2025 01:40:29 AM

-జీఎస్టీ సంస్కరణలు అమోఘమన్న ప్రధాని మోదీ

-యూపీఏ సర్కారుపై ధ్వజం 

-పిల్లలు తినే చాక్లెట్లను కూడా వదల్లేదని వ్యాఖ్య

-జాతీయ అవార్డులు పొందిన టీచర్లను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: జీఎస్టీ సంస్కరణల వల్ల సామాన్యులు రెండింతల ఆనందం పొందారని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా జాతీయ అవార్డులు పొందిన టీచర్లను ఉద్దేశించి గురువారం మాట్లాడారు. ‘సమయానుగుణంగా మార్పులు చెందకపోతే.. ప్రస్తుత పరిస్థితుల్లో దేశాన్ని ఈ స్థానంలో నిలపడం చాలా కష్టం. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చెప్పిన విధంగానే తర్వాతి తరం జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చాం.

దేశం స్వావలంబన దిశగా అడుగులు వేయాలంటే ఈ సంస్కరణలు చాలా అవసరం. దీపావళి, చత్ పూజాకు ముందే డబుల్ బొనాంజా ఉంటుందని నేను ప్రజలకు హామీనిచ్చిన విధంగానే సంస్కరణలు తీసుకొచ్చారు. జీఎస్టీ 2.0 దేశానికి, ప్రగతి వృద్ధికి రెండింతల మద్దతు అందించనుంది. 21 శతాబ్దంలో ఇండియా అభివృద్ధిలో దూసుకుపోయేందుకు ఈ సంస్కరణలు ఎంతో తోడ్పాటునందిస్తాయి. జీఎస్టీ సంస్కరణల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు పంచరత్నాలు జోడించబడ్డాయి.

ప్రస్తుతం జీఎస్టీ మరింత సరళీకృతం అయింది. నవరాత్రుల తొలి రోజు నుంచే జీఎస్టీ కొత్త విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం వల్ల భారతీయ పౌరుల జీవన విధానం మెరుగుపడనుంది. వ్యాపారం చేయడం మరింత సులభతరం అవుతుంది. దీని వల్ల పెట్టుడులు, ఉపాధి అవకాశాలు కూడా పెరగనున్నాయి. జీఎస్టీ సంస్కరణలు అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించేందుకు సమాఖ్య సహకారాన్ని పెంపొందిస్తాయి.

కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో ఇండ్లలో ఉపయోగించే వస్తువుల మీద కూడా అధికంగా పన్నులు వేశారు. బీజేపీ ప్రభుత్వం ఆనాటి సమస్యలు సామాన్యుడికి తెలియజెప్పే ప్రయత్నం చేసింది. మీ నెలవారీ ఖర్చులను కాంగ్రెస్ ఎలా పెంచిందో ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. పిల్లలు తినే చాక్లెట్ల మీద కూడా వారు 21 శాతం పన్నులు వేశారు. ఇదే పని మోదీ చేసి ఉంటే వారు నాపై తీవ్ర విమర్శలు చేసేవారు. ప్రజలకు మేలు చేయడమే మా ప్రభుత్వ విధానం.

జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేదలు, మధ్యతరగతి, మహిళలు, విద్యార్థులు, రైతులు, యువత ఇలా ప్రతి ఒక్కరికీ ప్రయోజనం కలగనుంది. ఆత్మనిర్భర్ భారత్ కల మరింత ముందుగానే సహకారం అయ్యే అవకాశం ఉంది. హెయిర్ క్లిప్‌లు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విధానం మారాలి. ప్రస్తు తలం రూ. లక్ష కోట్ల విలువైన వంటనూనె దిగుమతి చేసుకుంటున్నాం. చంద్రయాన్ విజయంతో ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలని కలలు కంటున్నాడు.

నూతన ఆవిష్కరణలు పెరిగే సమయం ఆసన్నమైంది. టీచర్లు విద్యాబుద్ధులతో పాటు యువతరానికి కూ డా దారి చూపాలి. మేడిన్ ఇండియాపై విద్యార్థులకు చిన్ననాటి నుంచే అవగాహన కల్పించాలా. మన దేశంలో తయారైన వస్తువులను మాత్రమే వాడేలా ప్రోత్సహించాలి’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, విద్యాశాఖ సహాయమం త్రి జయంత్ చౌధరి పాల్గొన్నారు.