05-09-2025 01:38:50 AM
-అవినీతిమయంగా మారిన కాషాయదళం
-బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
-బీజేపీ ఎమ్మెల్యేల ‘జైశ్రీరామ్’ నినాదాలు
-రణరంగంగా మారిన అసెంబ్లీ
-ఎంతకూ శాంతించని శాసనసభ్యులు
-రంగప్రవేశం చేసిన మార్షల్స్
-బీజేపీ చీఫ్ విప్‌కు గాయాలు
-ప్రజాస్వామ్యం చచ్చిపోయిందన్న బెంగాల్ బీజేపీ చీఫ్
కోల్‌కతా, సెప్టెంబర్ 4: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలు ఓట్ల దొం గలు అని బీజేపీ అవినీతిమయంగా మారిందని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. సీఎం మమత ప్రసంగంతో అసెంబ్లీలో రణరంగ పరిస్థితులు ఏర్పడ్డాయి.
‘బెంగాల్ వ్యతిరేక బీజేపీని తొలగించి దేశాన్ని కాపాడండి’ అని సీఎం మమత పేర్కొన్నారు. పరి స్థితులు అదుపుతప్పడంతో స్పీకర్ బిమాన్ బెనర్జీ బీజేపీ చీఫ్ విప్ సహా బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. బయ టకు వెళ్లేందుకు చీఫ్ విప్ శంకర్ ఘోష్ నిరాకరించడంతో మార్షల్స్ సాయంతో బలవం తంగా బయటకు పంపించారు.
ఈ క్రమం లో బీజేపీ చీఫ్ విప్ స్పృహ కోల్పోయారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీ వలస కూ లీలపై దాడులను ఖండిస్తూ అధికార టీఎం సీ ఒక తీర్మానాన్ని ఆమోదించేందుకు ప్రయత్నించగా.. బీజేపీ ఎమ్మెల్యేలు ‘జైశ్రీరామ్’ నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. అసెంబ్లీ గొడవ విషయం తెలియడంతో ప్రతిపక్ష నేత సువేందు అధికారి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ‘అసెంబ్లీలో ప్రజాస్వామ్యం హత్య చేయబడింది. టీఎంసీ క్యాడర్‌ను గుండాల్లా ప్రవర్తించారు’ అని ఆరోపించారు.
త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కూలిపోతుంది
బెంగాల్ అసెంబ్లీ వేదికగా మమతా బెన ర్జీ సుదీర్ఘంగా ప్రసంగించారు. సీఎం ప్రసం గం మొదలు కావడంతోనే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అయినా కానీ సీ ఎం మాత్రం అలాగే తన ప్రసంగం కొనసాగించడం గమనార్హం. ‘నరేంద్ర మోదీ, అమి త్‌షా బెంగాల్ వ్యతిరేకులు. బెంగాలీలపై వేధింపులకు సంబంధించిన చర్చను అడ్డుకుంటున్నారు. బీజేపీ పార్టీ అవినీతిమయం అయిపోయింది.
ఓట్లు దొంగతనం చేసిన పార్టీ బీజేపీ. బీజేపీ బందిపోటు దొంగలతో నిండిపోయింది. బెంగాల్‌కు చెందిన ఎంపీలను పార్లమెంట్‌లో వేధించేందుకు సీఐ ఎస్‌ఎఫ్ బలగాలను ఎలా వాడుకుందో చూ శాం. బెంగాల్ వ్యతిరేక బీజేపీని తొలగించండి రక్షించండి. నా మాటలు గుర్తుం చుకోండి. ఈ సభలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా లేకుండా పోతాడు.
ఆ రోజు త్వరలోనే వస్తుంది. ప్రజలు మిమ్మల్ని అధికారం నుంచి ప్రజలు మిమ్మల్ని దించేస్తారు. మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో బెంగాలీ వలస కూలీలపై జరుగుతున్న దాడులపై అసెంబ్లీలో చర్చించేం దుకు బీజేపీ భయపడుతోంది. బీజేపీ ఎమ్మెల్యేల ప్రవర్తన సముచితం కాదు. అన్‌పా ర్లమెంటరీ తరహాలో వారు వ్యవహరిస్తున్నా రు’ అని ఆరోపించారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
బెంగాల్ అసెంబ్లీలో గురువారం ప్రజాస్వామ్యం ఖూనీ అ యిందని బెంగాల్ ప్రతిపక్షనేత సు వేందు అధికారి ఆరోపించారు. ‘ప్రజాస్వామ్య హంతకురాలు మమతా బెనర్జీ తో పాటు ఆమె బానిస పాలకులు ఈ రోజు పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గొడవ అనంతరం ఆయన అసెంబ్లీ వద్దకు చేరుకుని మీడియాతో మా ట్లాడారు. ‘మొత్తం టీఎంసీ క్యాడర్ గుండాలు.
వారు శంకర్ ఘోష్‌పై భౌతికదాడికి దిగారు. మమతా బెన ర్జీ బెంగాల్ గజదొంగ’ అని అభివర్ణించారు. స్పీకర్ బిర్మాన్ ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు శంకర్ ఘోష్, అగ్నిమిత్ర పాల్, మి హిర్ గోస్వామి, అశోక్ దిండా, బాన్ కిం ఘోష్ సస్పెండ్ అయ్యారు. మూడు రోజుల ప్రత్యేక సమావేశా లు గురువారంతో పూర్తయ్యాయి.