calender_icon.png 16 May, 2025 | 12:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్సీవేర్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురితమైన డాక్టర్ బండి శ్రీకాంత్ పరిశోధన

15-05-2025 07:51:51 PM

బ్రెస్ట్ క్యాన్సర్ పై జరిపిన పరిశోధనకు గాను ప్రముఖ జర్నల్లో ప్రచురణ..

సిద్దిపేట: సిద్దిపేట మండలం రావురుకుల గ్రామానికి చెందిన డాక్టర్ బండి శ్రీకాంత్ బ్రెస్ట్ క్యాన్సర్(Breast Cancer) పై చేసిన పరిశోధన గాను ప్రముఖ ఇంటర్నేషనల్ సైన్స్ జర్నల్ ఎల్సీవేర్(International Science Journal Elsevier) లో ప్రచురితమైంది. రోజురోజుకు సమాజంలో పెరుగుతున్న క్యాన్సర్ ను పరిశోధనాంశంగా ఎంచుకొని రీసర్చ్ గావించాడు. నేటి సమాజంలో స్త్రీలలో తరచుగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ కు కారణమైన క్యాన్సర్ సెల్స్ ను నిర్మూలించేందుకు కావలసిన డ్రగ్స్ పై పరిశోధన జరిపాడు.

'సెనర్జిటిక్ ఇండ్యూస్మెంట్ ఆఫ్ ప్రోగ్రామ్ సెల్ డెత్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ సెల్ లైన్ అండ్ మైక్రోబియల్ గ్రౌత్ ఇన్హేబిషన్ బై మిథైల్ సెల్యూలోస్ బ్లెండెడ్ పాలిమెట్రిక్ నానో ఫైబర్ మాట్స్ త్రో కంట్రోల్ డ్రగ్ రిలీజ్' అంశంపై పరిశోధన గావించాడు. తన పరిశోధన గాను ప్రముఖ ఎల్సీవేర్ జర్నల్ నుంచి యాక్సెప్టెన్సీ వచ్చింది, ఎల్సీవేర్ జర్నల్ కు చెందిన ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ బయోలాజికల్ మాక్రోమాలిక్యుల్స్ లో తన పరిశోధన పత్రం ప్రచురితమైంది. ప్రపంచంలోనే ప్రముఖ సైంటిస్టులు తమ పరిశోధన పత్రాలను ఎల్సీవేర్ జర్నల్లో ప్రచురిస్తారు. ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ఈ సైన్స్ జర్నల్ లో శ్రీకాంత్ పరిశోధన ప్రచురితమైనందుకు ఉస్మానియా యూనివర్సిటీ జువాలజీ సీనియర్ ప్రొఫెసర్ మాధవి యూనివర్సిటీ అధ్యాపకులు మిత్రులు గ్రామస్తులు తదితరులు అభినందనలు తెలియజేశారు.