15-05-2025 11:50:04 PM
రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులపై కలెక్టర్ సమీక్ష
ఆదిలాబాద్ (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం కింద నమోదైన అన్ని దరఖాస్తులను పూర్తిస్థాయిలో బ్యాంకర్లు, ఎంపిడిఓలు 19వ తేదీలోగా పూర్తిగా పరిశీలించి జాబితా అందజేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) ఆన్నారు. రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలనపై ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో లు, బ్యాంక్ మేనేజర్లు, అధికారులతో గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐటిడిఎ పిఓ ఖుష్బూ గుప్తా తో కలసి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల స్థాయిల్లో పరిశీలించారు. ఏ మేరకు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాజీవ్ యువ వికాసం కింద నమోదు కాబడిన దరఖాస్తుల సంఖ్య 48,296 ఇందులో నేటి వరకు 43,417 వేలు (డెస్క్ వెరిఫికేషన్) దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఇప్పటి వరకు బ్యాంకులకు పంపించిన దరఖాస్తులు 32,283. బ్యాంక్, ఎంపీడీవో ఆపరేటర్ల సహకారంతో వచ్చిన దరఖాస్తులను బ్యాంక్ మేనేజర్లు పరిశీలన ప్రక్రియ వేగవంతం చేసి సోమవారంలోగా జాబితాను అందించాలని ఆన్నారు. బ్యాంకుల ద్వారా జాబితా పూర్తయిన తరువాత ఎంపీడీవో లు ఫైనల్ జాబితా తయారుచేసి పంపాలని తెలిపారు. సమావేశంలో ఎస్సీ కార్పోరేషన్ ఈడీ మనోహర్, జడ్పీ సీఈఓ జితెందర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉత్పల్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ లు, మున్సిపల్ కమిషనర్, సీవీయన్ రాజు, ప్రత్యేక అధికారులు, ఎంపీడీవో లు, ఎంపిఓ లు, తదితరులు పాల్గొన్నారు.