15-05-2025 07:47:06 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మానుకోట జిల్లా 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలపడానికి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ఒక టీం వర్క్ గా కృషి చేయడం వల్ల సాధ్యమైందని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు డాక్టర్ పరికిపండ్ల అశోక్(Child Welfare Committee Member Parikipandla Ashok) అన్నారు. జిల్లాలో ఉన్న ఉపాధ్యాయ బృందం అంతా కలిసి జిల్లాని రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపడం, ఇది సమైక్య కృషికి ఫలితం అని, కీలక పాత్ర పోషించిన విద్యాశాఖ అధికారి అభినందనీయులని ఆయన అన్నారు. పదిలో పదిలమైన స్థానాన్ని నిలపడం కోసం సర్వత్ర పనిచేసిన జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్, బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు వీరేందర్ గౌడ్, ఆరోగ్య మిత్ర ప్రతినిధి వెనగంటి శుభ తదితరులు పాల్గొన్నారు.