06-07-2025 06:54:38 PM
కొత్తపల్లి: కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్లోని బీజేపీ జండాగద్దె వద్ద శక్తి కేంద్రం ఇంచార్జ్ నరహరి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో స్వర్గీయ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ(Dr. Shyama Prasad Mukherjee) చిత్రపటానికి పూలమాలలు వేసే ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోన్ అధ్యక్షులు జాడి బాల్ రెడ్డి మాట్లాడుతూ.. జన్ సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ నెహ్రూ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా పనిచేస్తూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370ను ఎత్తి వేయాలని మంత్రి పదవికి రాజీనామా చేశారని, ఒకే దేశములో ధోవిదాన్, దోనిషాన్, ధో ప్రధాన్ నహి చెలేగి నహి చలేగి అంటూ దేశం కొరకు తమ ప్రాణాలను అర్పించిన గొప్ప దేశభక్తుడు శ్యాం ముఖర్జీ అని కొనియాడారు.
వారి ఆశయాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పని చేస్తుందని బీజేపీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, చంద్రగిరి వేణు, పోతు జగదీష్ ,ఈ రెడ్డి తిరుమలరెడ్డి, అబ్బి డిమాధవరెడ్డి పాకాల వెంకటేశ్వర్ రెడ్డి, నాయకులు ఎన్నం ప్రకాష్, బండ రమణారెడ్డి, మామిడి రమేష్, బాలు, రవి గోపాల్, దయ్యాల మల్లేశం, సంజీవ్ కుమార్ మరియు యాదగిరి పాల్గొన్నారు.