06-07-2025 06:56:41 PM
చండూరు (విజయక్రాంతి): చండూరు మండల(Chandur Mandal) పరిధిలోని తుమ్మలపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు, ఆలయ కార్య నిర్వహణ అధికారి అంబటి నాగిరెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ గుండ్రెడ్డి రమ్య రామలింగారెడ్డి, తొలి ఏకాదశి సందర్భంగా రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివుడికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఆలయ అభివృద్ధి కోసం మా వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.
అనంతరం దేవాదాయ శాఖ కమిషన్ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా దేవాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు కురుపాటి సుదర్శన్, మాజీ చైర్మన్ గజ్జల కృష్ణారెడ్డి, చండూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కూరుపాటి శేఖర్, గుండ్రెడ్డి సంజీవరెడ్డి, ధర్మకర్తలు బోయపల్లి రాములు, జిల్లా నరసింహ, కూరపాటి వెంకటమ్మ ముత్తయ్య, గ్రామస్తులు కురుపాటి నాగరాజు, భూతరాజు లింగయ్య, నాంపల్లి వెంకటేష్, ఆలయ అర్చకులు కారు వంక శంకర్ శర్మ, హరి ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.