calender_icon.png 7 July, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైన మోడల్ స్కూల్ విద్యార్థులు

06-07-2025 06:50:00 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలోని తెలంగాణ ఆదర్శ(మోడల్) పాఠశాలకు చెందిన విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీ(IIIT Basara)లో ప్రవేశాలకు ఎంపిక అయ్యారని పాఠశాల ప్రిన్సిపాల్ సారా తస్నిమ్  తెలిపారు. ఎంపికైన వారిలో సీహెచ్ సిరి, అమ్రీన్, సఫ్రీన్, సోఫియా ప్రేరణ, అశ్విక్ తేజ్ లు ఉన్నారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆమె అభినందించారు. జిల్లా వ్యాప్తంగా 30 మంది విద్యార్థులు ట్రిపుల్ ఐటీకి ఎంపిక కాగా అందులో పట్టణానికి చెందిన మోడల్ స్కూల్ విద్యార్థులు 5 గురు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని అన్నారు. అంకిత భావంతో బోధించే ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారంతోనే ప్రతిష్టాత్మక ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు సీట్లు సాధించారని ఆమె స్పష్టం చేశారు.