calender_icon.png 4 October, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాలాల జడ్పీటీసీ బరిలో డాక్టర్ విహసిత్..

04-10-2025 04:53:31 PM

తాండూరు (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా యాలాల జడ్పీటీసీ బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రముఖ వైద్యులు, బివిజి ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సునీత సంపత్ ల తనయుడు డాక్టర్ విహాసిత్ పోటీలో ఉంటున్నట్టు సమాచారం. ఎంబిబిఎస్ విద్యను పూర్తి చేసి ప్రస్తుతం ఎముకల ప్రత్యేక వైద్యుడిగా సేవలు అందిస్తున్నారు. డాక్టర్ సంపత్ కుమార్ కు యాలాల మండలంలో ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉండడం విహాసిత్ కు కలిసి వచ్చే అంశం. అంతేగాక బివిజి ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేద ప్రజల కుటుంబ పెద్ద మృతి చెందితే ఆర్థిక సహాయం, నిరుపేద కుటుంబంలో ఆడపడుచు వివాహాలకు పుస్తే, మెట్టెలు అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తిగా డాక్టర్ సంపత్ కుమార్ కు మంచి పేరు ఉంది. ఈ అంశం కూడా విహసిత్ విజయానికి దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.