04-10-2025 06:21:36 PM
ముస్తాబాద్ (విజయక్రాంతి): ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గంత రాజు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఐతమ్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముస్తాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాల్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గజ్జల, రాజు, ఏఎంసి చైర్మన్ తలారి రాణి నర్సయ్య చేతుల మీదుగా పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి శ్రీనివాస్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీలోకి వస్తున్న నాయకులకు మండల అధ్యక్షుడు బాల్రెడ్డి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ క్యారం రాజు,సింగల్ విండో మాజీ వైస్ చైర్మన్ దేవి రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి వంగమోహన్ రెడ్డి, ఉప సర్పంచ్, సీనియర్ నాయకులు పెండ్యాల నారాయణ, కమ్మరి శ్రీనివాస్, క్యారం రామచంద్రం, మైదంపల్లి హనుమంతరావు, పల్లపు రమేష్, ఎండి అక్రమ్, పిర్ మమ్మద్, గంత సాయికుమార్, చిగురు రాములు, సిత్తరి రవి, బంటు నవీన్, మాదాసు రౌగిత్ తదితరులు పాల్గొన్నారు.