calender_icon.png 4 October, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

04-10-2025 04:59:11 PM

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh ​​Surabhi) ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పీఓ, ఏపీఓలకు అక్టోబర్ 6న నిర్వహించనున్న ఒకరోజు శిక్షణ కార్యక్రమంపై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించే ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా  చేయాలని ఆదేశించారు. సరైన శిక్షణ గదులు, మైక్ సిస్టమ్, పవర్ పాయింట్ ద్వారా అవగానం కల్పించేందుకు ఏర్పాట్లు తదితర అన్ని రకాల ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం పీఓలకు సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. 

పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నిబంధనలు అవగాహన చేసుకుని సన్నద్ధత కావాల్సి ఉంటుందన్నారు. శిక్షణ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాలు, పీఓల బాధ్యతలు తెలుసుకున్నప్పుడే పీఓలు సక్రమంగా పోలింగ్ కేంద్రంలో పోలింగ్ నిర్వహించగలరని, కాబట్టి శిక్షణను సీరియస్ గా, శ్రద్ధ గా నిర్వహించాలన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలనీ, నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలనీ సూచించారు. శిక్షణకు వచ్చే పీఓలకు పోస్టల్ బాలట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు. పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిన పీఓలదే బాధ్యత అని, జాగ్రత్తగా వ్యవహారించాలని వారికి తెలియజేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘనాథ్, డప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డిఈఓ అబ్దుల్ఇఘని, ఏఓ భాను, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.