calender_icon.png 4 October, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించాలి

04-10-2025 06:24:07 PM

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత..

బోయినపల్లి (విజయక్రాంతి): ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో పేద ప్రజలకు చక్కని వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత కోరారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు రిజిస్టర్ లను మందుల వినియోగం రిజిస్టర్ లను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే వైద్యాన్ని పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆరోగ్య సేవలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించరాదని చెప్పారు. వైద్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే సీసీఏ నిబంధన ప్రకారం సిబ్బందిపై చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట స్థానిక వైద్యాధికారి రేణు ప్రియాంక వైద్య సిబ్బంది ఉన్నారు.