calender_icon.png 4 October, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ఏర్పాట్లు పక్కాగా ఉండాలి

04-10-2025 06:17:29 PM

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్..

జనగామ (విజయక్రాంతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల కోసం ఏకాశీల బిఈడి కాలేజ్, ఏబీవీ, విబి ఐటి, కాలేజీలను అలాగే జనగామ మండలం సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రం కోసం స్థానిక  గౌతమ్ మాడల్ స్కూల్ ను డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏసిపి పండరి చేతన్, సంబంధిత అధికారులతో కలిసి శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం నియమాలకు అనుగుణంగా డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ లు ఉండాలన్నారు. స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద చేయాలిసిన ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. పోలీస్ బందోబస్తూ, రవాణా, పార్కింగ్ సదుపాయాలతో పాటు, భద్రతాపరమైన అంశాలను సంబంధిత అధికారులతో కలెక్టర్ చర్చించారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎంపీడీఓ, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.