calender_icon.png 4 October, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టు నూతన భవనానికి శంకుస్థాపన..

04-10-2025 06:30:52 PM

వనపర్తి టౌన్: వనపర్తి చరిత్రలో ఒక కల్కితు రాయిగా నూతన కోర్టు నిల్వబోతున్న కోర్టు భవనం ఆదివారం రోజు శంకుస్థాపన చేసుకోబోతున్నామని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం వనపర్తి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ కమిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వనపర్తి చరిత్రలో భవిష్యత్తు తరాల ఉపయోగపడే నూతన కోర్టు భవనానికి ఆదివారం శంకుస్థాపన కార్యక్రమం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆపరేషన్ కుమార్ సింగ్ ఉదయం 11:25 నిమిషములకు వర్చువల్ గా ప్రారంభిస్తారన్నారు. ఈ కార్యక్రమానికి  వనపర్తి జిల్లా అడ్మినిస్ట్రేషన్ జడ్జి అనిల్ కుమార్ జూకంటి, జస్టిస్ మాధవి దేవి, నాగార్జున, ట్రిబనల్ బోర్డ్ చైర్మన్ సాంబశివ నాయుడు, బార్ కౌన్సిల్ మెంబర్స్, దాదాపు 35 మంది జడ్జిలు, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు  కమిటీలు న్యాయవాదులు  దాదాపు 500 మంది పాల్గొంటారన్నారు.

ఉదయం 10 గంటలకు ఇద్దరు జడ్జీలు వనపర్తి పట్టణంలో ఉన్న గెస్ట్ హౌస్ చేరుకుంటారు అక్కడి నుండి ఉదయం 10.30 గంటలకు మెడికల్ కాలేజ్ ఆ ప్రాంతంలో 20 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేయబోవు నూతన కోర్టు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని జడ్జీలు న్యాయవాదులు పాల్గొంటారు. అనంతరం జిల్లా కోర్టు ఆవరణలో  ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్జీలు తెలంగాణ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్, న్యాయవాదులు పాల్గొని సన్మానిస్తారు. ఈ నూతన భవన నిర్మాణానికి గతంలో మా సమస్యలను పరిస్కరించాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి వివరిస్తే ఆయన మంజూరు చేయించారని అందుకు కొన్ని సమస్యలు ఉంటే ఈ మధ్యనే పరిస్కరించుకొని హైకోర్టు ఆమోదం తెలిపిన చిత్రాన్ని మీడియాకు చూపించారు. తెలంగాణ రాష్ట్ర లోనే వనపర్తి కోర్టు భవనం మొదటిదని 80 కోట్లతో నిర్మాణం కాబోతుందని ఆయన మీడియాకు వివరించారు.