calender_icon.png 4 October, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచి నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడండి

04-10-2025 06:27:01 PM

కమిషనర్ ఆదేశం

కరీంనగర్ (విజయక్రాంతి): మంచినీటి సరఫరాలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో శనివారం రోజు ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ అభివృద్ధి లో భాగంగా వివిధ గ్రాంట్లకు సంబంధించిన పెండింగ్ అభివృద్ధి పనులతో పాటు కరీంనగర్ స్మార్ట్ సిటి కార్పోరేషన్ లిమిటెడ్ పెండింగ్ అభివృద్ధి పనులు, మంచి నీటి సరఫరా తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అధికారులకు పలు సలహాలు సూచనలు చేస్తూ.... ఆదేశాలు జారీ చేశారు. ఈ సంధర్బంగా కమీషనర్ ప్రఫూల్ దేశాయ్ మాట్లాడుతూ... కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ లో చేపట్టిన పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నగర వ్యాప్తంగా వివిధ గ్రాంట్ల నిధులతో పనులు ప్రారంభం చేసి... పెండింగ్ లో ఉన్న అన్ని అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అభివృద్ధి పనులు జరిగే చోట ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. చేపట్టిన అభివృద్ధి పనులన్ని టైమ్ లైన్ ప్రకారం, టెండర్ అగ్రిమెంట్ ప్రకారం కాంట్రాక్టర్లు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. నగర వ్యాప్తంగా త్రాగునీటి సరఫరాలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సమయం ప్రకారం ప్రతి రోజు ప్రజలకు త్రాగు నీటి సరఫరా చేయాలని... సరఫరా సమయంలో ఇంజనీరింగ్ అధికారులతో పాటు లైన్ మెన్ పిట్టర్ల పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు. నీటి సరఫరా సమయంలో నగర వ్యాప్తంగా లీకేజీలను గుర్తించి వెంట వెంటనే అరికట్టాలని ఆదేశించారు. ఎక్కడైన నీటి సరఫరా పైపులైన్ వాల్స్ మరమ్మతులు ఉన్న చేపట్టాలని ప్రజలకు ప్రెషర్ తో కూడిన నీరు సరఫరా జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ఈ రాజ్ కుమార్, ఈఈలు సంజీవ్ కుమార్, యాదగిరి, డీఈ ఓం ప్రకాష్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.