04-10-2025 06:19:31 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామపంచాయతీ పరిధిలో గల బోయపల్లి బోర్డ్ వద్ద నేషనల్ హైవే అధికారులు అప్రోచ్ రోడ్డు వేయకపోవడంతో భారీ గుంత ఏర్పడింది. శనివారం కురిసిన ఏకదాటి వర్షానికి గుంతలో నీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. అంకుశం, చౌటపల్లి గ్రామ పంచాయతీల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ భారీ గుంతను పూడ్చాలని పలుసార్లు నేషనల్ హైవే అధికారులకు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని ఈ రెండు పంచాయతీల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అప్రోచ్ రోడ్డు వేయాలని కోరారు. అప్రోచ్ రోడ్డు వేయకుంటే నేషనల్ హైవే అథారిటీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఈ రెండు పంచాయతీల ప్రజలు సిద్ధంగా ఉన్నారని సిపిఐ మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.