calender_icon.png 25 September, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14వ శతాబ్దం నేపథ్యంలో ద్రౌపది2

25-09-2025 12:00:00 AM

రిచర్డ్ రిషి ప్రధాన పాత్రలో నటిస్తున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా ‘ద్రౌపది2’. తమిళ, -తెలుగు ద్విభాషా చిత్రానికి మోహన్ జీ దర్శకత్వం వహిసున్నారు. జీఎం ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నేతాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చోళ చక్రవర్తి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి షూటింగ్ బుధవారంతో ముగిసింది. ఈ విషయాన్ని దర్శక, నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో 14వ శతాబ్దం నాటి దక్షిణ భారతదేశ వైభవాన్ని చూపించబోతోన్నారు.

ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రక్షణ ఇందుసూదన్ కథానాయికగా నటించగా నట్టి నటరాజ్, వైజీ మహేంద్రన్, నాడోడిగల్ బరణి, శరవణ సుబ్బయ్య, వేల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేశ్ లాంబా, గణేశ్ గౌరంగ్, దివి, దేవయానిశర్మ, అరుణోదయన్ ముఖ్యపాత్రలను పోషించారు.

ఈ సినిమానున మేకర్స్ డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్ వైబోధ; మాటలు: పద్మ చంద్రశేఖర్, మోహన్ జీ; సినిమాటోగ్రఫీ: ఫిలిప్ ఆర్ సుందర్; స్టంట్స్: యాక్షన్ సంతోష్; ఎడిటింగ్: దేవరాజ్; ఆర్ట్: కమల్నాథన్.