25-09-2025 12:00:00 AM
యాదమ్మ రాజు, గల్లీబాయ్ భాస్కర్, బిగ్‌బాస్ ఇమాన్యుయేల్, బల్వీర్ సింగ్, గడ్డం నవీన్, పవన్ శెట్టి, రాజేశ్ ధ్రువ, రాధిక అచ్యుత్‌రావు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘భూతం ప్రేతం’. రాజేశ్ ధ్రువ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సృజన ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బీ వెంకటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్, గ్లింప్స్‌ను టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బుధవారం విడుదల చేశారు.
ఈ టైటిల్ చూస్తుంటే హారర్, కామెడీ చిత్రం అని అర్థమవుతోంది. ఇక ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చూస్తుంటే ఓ ఐదుగురు కుర్రాళ్లు.. భూతానికి, ప్రేతానికి చిక్కినట్టు కనిపిస్తోంది. ఆ భూతం నుంచి ఈ కుర్రాళ్లు ఎలా బయటపడ్డారు? అనే కథను నవ్విస్తూ,
భయపెట్టేలా మలిచారని తెలుస్తోంది. మేకర్స్ ఈ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిరీష్ హోతుర్; కెమెరా: యోగేశ్ గౌడ; ఎడిటర్: ఉజ్వల్ చంద్ర; ఆర్ట్: దేవి ప్రకాశ్ శెట్టి.