19-09-2025 06:53:23 PM
వేములవాడ టౌన్,(విజయక్రాంతి): యువత స్వయం ఉపాధి వైపు పయనించడం అభినందనీయమని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 2ను బైపాస్ రోడ్డులో శుక్రవారం మెన్స్ వెర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... యువత చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా స్వయం ఉపాధి కోసం కృషి చేయడం అభినందనీయం అన్నారు. స్వయం ఉపాధి కోసం కృషి చేస్తున్న యువతకు ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా కల్పించారు.