calender_icon.png 20 September, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు ఆపలేదని డ్రైవర్‌పై దాడి

20-09-2025 12:00:00 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): చెయ్యెత్తినా బస్సు ఆపకుండా వెళ్తావా అంటూ మోటార్ సైకిల్ పై వచ్చి మార్గ మధ్యలో బస్సు ఆపి డ్రైవర్ పై దాడి చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శుక్రవారం జరిగింది.

మహబూబాబాద్ నుండి వరంగల్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు అధిక సంఖ్యలో ఉండడంతో కేసముద్రం పట్టణంలోని బడి తండా వద్ద ఓ మహిళ ప్రయాణికురాలు చెయ్యెత్తి బస్సు ఆపమని కోరినప్పటికీ డ్రైవర్ బస్సు ఆపకుండా తీసుకెళ్లగా, అదే తండాకు చెందిన ఓ వ్యక్తి మోటార్ సైకిల్ పై బస్సులు వెంబడించి మార్గమధ్యలో బస్సు ఆగగా డ్రైవర్ తో వాగ్వాదానికి దిగాడు.

ఈ క్రమంలోనే సదరు వ్యక్తికి సమీప బంధువు ఒకరు అక్కడికి వచ్చి చెయ్యెత్తి బస్సు ఆపాలని చెప్పిన వినకుండా వెళతావా అంటూ డ్రైవర్ ను దాడికి పాల్పడ్డాడు. దీనితో డ్రైవర్ విష్ణుమూర్తి బస్సును పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి తనపై దాడికి పాల్పడ్డ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.