calender_icon.png 25 September, 2025 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ ఆధునీకరణలో ‘డ్రోన్’ కీలకం

25-09-2025 12:00:00 AM

  1. మన అగ్రిటెక్‌లో డ్రోన్ మేళా 

ప్రారంభించిన ఎనమాముల గ్రేడ్ సెక్రటరీ జి.రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఆధునిక వ్యవసాయంలో భాగంగా మన అగ్రిటెక్ వరంగల్ వారు రైతాంగానికి సువర్ణావకాశం కల్పించే దిశగా బుధవారం డ్రోన్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఆసియాలోనే అతిపెద్ద రెండవ గ్రేన్ మార్కెట్ కేంద్రంగా నెలకొల్పిన మన అగ్రిటెక్ సంస్థ లో వివిధ రకాల కంపెనీల డ్రోన్ స్ప్రేయర్స్ ప్రదర్శన నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని ఎనమాముల మార్కెట్ గ్రేడ్ సెక్రటరి జి.రెడ్డి ప్రారంభించారు. డ్రోన్ స్ప్రేయర్స్‌లో రకాలు మరియు వాటి పనితీరు ఇతర సాంకేతిక సమాచారంతో పాటు అన్ని డ్రోన్స్ యొక్క సమాచారం డ్రోన్ మేళా ద్వారా రైతులకు, ఆధునిక వ్యవసాయ ప్రేమికులకు తెలిపడం జరిగింది.

ఈ సందర్భంగా మన అగ్రిటెక్ అధినేత మాట్లాడుతూ.. వ్యవసాయ రంగం లో నూతన ఒరవడి సృష్టించి  ఆధునిక వ్యవసాయంలో పిచికారి వ్యవస్థలో డ్రోన్ ద్వారా మన అగ్రిటెక్ ద్వారా రైతులకు నూతన అవకాశం కల్పిస్తున్నది” అన్నారు. ఈ డ్రోన్స్‌ను మన అగ్రిటెక్‌లో లోన్, సబ్సిడీలో అందిస్తున్నట్టు తెలిపారు.