25-09-2025 12:00:00 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తోటి విద్యార్థులపై ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చౌటుప్పల్ ఏసీపీ పి మధుసూదన్‌రెడ్డి హెచ్చరిం చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్ విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బుధవారం యాంటీ ర్యా గింగ్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏసీ పీ మాట్లాడుతూ.. ర్యాగింగ్ అనేది విద్యార్థుల భవిష్యత్తును మాత్రమే కాకుండా సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని అన్నారు. విద్యార్థులు ర్యాగిం గ్, ఈవ్-టీజింగ్కు పాల్పడకూడదని.. అలాగే డ్రగ్స్, గంజాయి, సిగరెట్స్, ఇతర మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యా సంస్థల్లో ర్యాగింగ్ నియంత్రణకై యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
విద్యాసంస్థల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు పోలీసు లు కలిసి పనిచేసిప్పుడే ర్యాగింగ్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించగలుతామని ఏసీపీ తెలియజేశారు. విద్యార్థులు ర్యాగింగ్ అనే విష సంస్కృతికి దూరంగా ఉండాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం సుబ్బారావు చెప్పారు. తోటి విద్యార్థులతో స్నేహంగా మెలగాలని కోరారు. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదని హెచ్చరించారు.
విద్యార్థులు తమ సహ విద్యార్థులపై ఎటువంటి వేధింపులు, దౌర్జన్యాలు, అసభ్య కార్యకలాపాలకు పాల్పడవద్దని భూదాన్ పోచంపల్లి మండల ఎస్సై కె భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ క్ర్పై సమాచారం అందించేందుకు లేదా ఫిర్యాదు చేసేందుకు 1930 లేదా 100 హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని చెప్పారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ యాంటీ ర్యాగింగ్ కమిటీ చైర్మన్ డా. వెంకటేశం మారగొని పాల్గొన్నారు.