25-09-2025 12:00:00 AM
ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ
ఖమ్మం, సెప్టెంబర్- 24 (విజయక్రాంతి): బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మీయత, సమైక్యతకు ప్రతీక అని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. ఖమ్మం నగరపాలక సంస్థ కార్యాలయంలో నాల్గవ రోజు బుధవారం నానే బియ్యం బతుకమ్మ వేడుకలను నిర్వహించారు.
మేయర్ పునుకొల్లు నీరజ, మునిసిపల్ కార్పొరేషన్, మెప్మా, మునిసిపాలిటీలకు చెందిన మహిళలు పెద్దఎత్తున పాల్గొని గౌరమ్మను పూజించి, బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ పూలను కొలిచే పండగ అని అన్నారు. మహిళల సాధికారతకు, సమాజంలో వారి పాత్రకు ప్రతీక బతుకమ్మ అని అన్నారు. ఈ వేడుకల్లో నగర డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారాపాల్గొన్నారు.