12-08-2024 12:00:00 AM
చెరువులన్నీ అరువుదెచ్చి నీళ్లు నింపుకుంటున్నాయి ఎండిన కాలువల నిండ మురికి నీళ్ళు ఉంటున్నయి దుర్గంధపు నీళ్ళు గలగల పారుతుంటే భూమాత మాట రాక మౌనంగా చూస్తోంది రైతన్న దారి లేక నోరెళ్ళ బెడుతుంటే తిండి లేక బాధ పడే రోజులే ముందున్నాయి నీళ్లు లేని గ్రామాలు నేటికీ మనకున్నాయి భూగర్భ జలనిధికి మంచి రోజులెప్పుడు వానకు నిండిన జలాశయాలు ఉంటే నీళ్ల పండగే మనకు పంటలన్నీ పచ్చగా, కళ్ళముందు కనపడితే దేశమాతా కడుపునిండా ధాన్యరాశులే ఉంటే జనం కోసం మనసు పెట్టి మంచి పనులే చేద్దాము కరువు లేని భారతాన్ని కనులారా చూద్దాము!
- బొమ్మిదేని రాజేశ్వరి
9052744215