calender_icon.png 5 August, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆకాశం బిక్క మొకమేసింది

12-08-2024 12:00:00 AM

నీలి రంగు తివాచీ పరిచి ఆకాశం సమావేశం ఏర్పాటు చేసింది జిగేల్ మంటున్న మెరుపుల వెలుగులో మబ్బులు ఎజెండా రూపొందించాయి మొక్కలూ, వృక్షాలూ మనుషులూ జంతువులూ ప్రాణులన్నింటికీ ఆహ్వానాలు వెళ్ళాయి ఇంతలో సమావేశ సమయం రానే వచ్చింది కాలుష్యం కబంద హస్తాల్లో చిక్కిన చెట్టూ చేమా అడవుల హననంలో మాడిపోతున్న జంతువులూ అభివృద్ది సాధనలో తీరికలేని మనుషులూ సమావేశానికి ఎవరూ హాజరు కాలేదు తివాచీ ఎడారయింది సూర్యచంద్రులు ముసిముసిగా నవ్వుకుంటూ దినచర్యలో పడ్డారు దిగులుగా వున్న భూమికేసి చూస్తూ ఆకాశం బిక్క మొకమేసింది శూన్యం కళ్ళల్లోంచి రెండు కన్నీటి బొట్లు రాలాయి.

వారాల ఆనంద్  

9440501281