calender_icon.png 5 August, 2025 | 1:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన బంగ్లాదేశీయులు

11-08-2024 09:07:16 PM

న్యూఢిల్లీ: భారత్ లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన 11 మంది బంగ్లాదేశీయులను ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ లో ఇద్దరు, త్రిపురలో మరో ఇద్దరిని, మేఘాలయా సరిహద్దులో ఏడుగురిని పట్టుకున్న బీఎస్ఎఫ్ ప్రకటించింది. బంగ్లాదేశీయులను విచారించిన అనంతరం పోలీసులకు అప్పగిస్తామని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ లో పరిస్థితులకు భయపడి భారత్ చేరుకుంటున్నట్లు బంగ్లియులు తెలిపారు. బీఎస్ఎఫ్ అధికారులు సరిహద్దులో కట్టుదిట్టమైన భద్రతాను చేపట్టారు.