calender_icon.png 16 July, 2025 | 4:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవరకద్ర నియోజకవర్గానికి డ్రై పోర్ట్

16-07-2025 12:00:00 AM

అడ్డాకుల మండలం గుడిబండ వద్ద టీఎస్‌ఐఐసీ 

భూమిని పరిశీలించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి 

అడ్డాకుల జూలై 15: దేవరకద్ర నియోజకవర్గంలోని అడ్డాకుల మండలం గుడిబండ వద్ద టీఎస్‌ఐఐసి అధికారులతో కలిసి డ్రై పోర్టు ఏర్పాటు చేసేందుకు గాను భూమిని పరిశీలించడం జరిగిందని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. వెనుకబడ్డ దేవరకద్ర నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృతనిచ్చాయంతో పని చేస్తున్నామన్నారు.

అందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలను తీసుకొచ్చి, ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఇటీవల దేవరకద్ర నియోజకవర్గ కేంద్ర సమీపంలో ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్ మిస్త్స్రల్ తయారీ యూనిట్ మరియు దాని అనుబంధ సంస్థల ఏర్పాటుకు సంబంధించి అధికారులు ప్రభుత్వ భూమి పరిశీలించి, వాటి ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు.

గతంలో దేవరకద్ర నియోజకవర్గం లో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించానని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, మంత్రి శ్రీధర్ బాబు గని కోరానని, దానికి వారు సానుకూలంగా స్పందించి, డ్రై పోర్ట్ ఏర్పాటుకు భూమిని పరిశీలించడానికి టీఎస్‌ఐఐసి అధికారులు గుదిబండ గ్రామానికి పంపారన్నారు.

నియోజకవర్గంలో 68 కిలో మీటర్లు జాతీయ రహదారి విస్తరించి ఉందని, ఈ గుడిబండ ప్రాంతం జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండడం, హైదరాబాద్, కర్నూల్, రాయిచూర్ ప్రాంతాలు మూడు రాష్ట్రాలకు ఈజీ కనెక్టివిటీ ఉందని, డ్రై పోర్ట్ ఏర్పాటుకు సరిపడా ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులుఉన్నారు.