20-07-2024 12:21:10 AM
రెండోరోజు 94.69% మంది హాజరు
హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): రెండో రోజు డీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం ఎస్జీటీ తెలుగు మీడియం అభ్యర్థులకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగగా, 27,061 మంది అభ్యర్థులకు 25,625 (94.69 శాతం) మంది హాజరయ్యారు. ప్రశ్నపత్రం నార్మల్ గా వచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు. టెట్ పేపర్‌లాగే డీఎస్సీ కూడా కొన్ని సబ్జెక్ట్స్ తేలికగా ఇచ్చారని పేర్కొన్నారు. మొత్తం గా 80 మార్కు లకు బాగా చేసిన వారికి 60 నుంచి 65 మార్కులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శనివారం మొదటి షిఫ్టులో ఎస్జీటీ ఉర్దు, ఇంగ్లీష్, తెలుగు మీడియం అభ్యర్థులకు, మధ్యాహ్నం షిఫ్టులో తెలుగు, ఉర్దూ మీడియం వాళ్లకు పరీక్షలు జరగనున్నాయి.