calender_icon.png 18 September, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేసీఐ కార్యక్రమాలు బేష్

17-09-2025 10:24:54 PM

జొన్ లేవల్ తో పాటు జాతీయ స్థాయి అవార్డులు పొందటం అభినందనీయం

నిజామాబాద్,(విజయక్రాంతి): జెసిఐ కార్యక్రమాలు బేష్ అని జొన్ లేవల్ తో పాటు జాతీయ స్థాయి అవార్డులు పొందటం అభినందనీమని బి సి టి యు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడ వేడి వినోద్ కుమార్ అన్నారు. జేసీఐ నిజామాబాద్ ఇందూర్ – 7వ రోజు వాలెడిక్టరీ వేడుకలు టీఎన్జీఓ భవన్ లో ముగింపు వేడుకలు గౌతమి పెండోటి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ వారోత్సవాలకు సహకరించిన యోగా మాస్టర్ డాక్టర్ ఐశ్వర్య,  స్కిల్ డెవలప్మెంట్ ట్రైనర్ శ్రీహరి లను  సన్మానించారు. ప్రిన్సిపల్ కల్పనా, వీణ లకు బహుమతులు ప్రదానం చేశారు. జేసీఐ వారం రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రాజెక్ట్ చైర్మన్లు సభ్యులుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం పూర్వ అధ్యక్షులను సత్కరించారు.

సాంస్కృతిక కార్యక్రమాల్లో నృత్యాలు, హాస్య స్కిట్లు, వెంట్రిలాక్విజం, మిమిక్రీ కళాకారుడు శంకర్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిసి ఉపాధ్యాయ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మాడవేటి వినోద్, గౌరవ అతిథులుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత రాఘవపురం గోపాలకృష్ణ, విశిష్ట అతిథులుగా జోన్ కోఆర్డినేటర్ జెసిఐ వీక్ నయన్ జిల్కర్, ఫౌండర్ విశ్వతేజాస్  ట్రైనింగ్ కౌన్సిలింగ్ సెంటర్ తిరునగరి శ్రీహరి, అంబం తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్   రాఘవేందర్ కులకర్ణి విచ్చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథి మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. జెసిఐ అంటే నే సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరని, సేవ కార్యక్రమాలతో పాటు వ్యక్తిత్వ వికాసం సంబంధించిన కార్యక్రమాలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటాయన్నారు. జెసిఐ లో ఇచ్చే ట్రైనింగ్  యువతకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జి సి ఐ కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా  గోపాలకృష్ణ మాట్లాడుతూ.. జేసీఐ లో చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని, జెసిఐ ఇంటర్నేషనల్ సంస్థ నిజామాబాదులో సేవా కార్యక్రమాలు అందించడం గొప్ప విషయం అన్నారు.

యువతకు ఎంతో ఉపయోగ పడే ట్రైనింగ్ కార్యక్రమాలు జేసీఐలో తప్ప మరెక్కడ లభించవన్నారు. ఈ సందర్భంగా జెసిఐ నిజామాబాద్ -ఇందూర్ అధ్యక్షురాలు పెందో టి గౌతమి మాట్లాడుతూ.. జెసిఐ  ద్వారా ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టి అవకాశం రావడం సంతోషంగా ఉందని, జేసీఐలో చేరి యువత భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలన్నారు. సేవతో పాటు జ్ఞాన సమూ పార్జనకు జెసిఐకి మించింది ఏదీ లేదని అన్నారు.