17-09-2025 10:29:11 PM
మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. మాజీ కేంద్ర మంత్రి తాత గడ్డం కాక వెంకటస్వామీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించాడు. అనంతరం మంథని పట్టణంలోని మంథని సీవీఆర్ జర్నలిస్ట్ మిరాల సాగర్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లో జరిగిన మహా కుంభమేళా కు వెళ్లి వస్తుండగా కారు చెట్టుకు ఢీకొని గాయాల పాలైన సాగర్ ను పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పరామర్శించి తన యోగక్షేమాలను తెలుసుకున్నారు. సాగర్ నీ ఆరోగ్యం కుదుటపడడానికి కావలసిన సహకారం తన వంతుగా ఉంటుందని ఎంపీ సాగర్ కు భరోసా కల్పించారు