17-09-2025 10:42:01 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలు బుధవారం బొడ్డెమ్మతో ప్రారంభమయ్యాయి. మహిళలు సాయంకాలం బోడ్డెమ్మను పేర్చి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. బొడ్డెమ్మ బొడ్డెమ్మ నీ పేరు గౌరమ్మ అంటూ మహిళలు పాటలు పాడుతూ బొడ్డెమ్మ పండుగ ను ప్రారంభించారు. మహిళలకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం రోజు బొడ్డెమ్మ ఆటతో బతుకమ్మ ఉత్సవాలను ఆడడం అనావైతిగా వస్తుంది. బొడ్డెమ్మ, గౌరమ్మ, బతుకమ్మలను మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి పువ్వులను పేర్చి పసుపు కుంకుమ చల్లడమే కాకుండా పసుపుతో గౌరమ్మ ను చేసి బొడ్డెమ్మ పాటలు పాడుతూ సంబరాలు ప్రారంభించారు.